Bali Tour: బాలి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!


Johan
త్వరలో బాలి ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మరికొద్ది రోజుల్లో అక్కడ పర్యాటకులు బైక్ రైడింగ్ చేయకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఇండోనేషియాలోని బాలి అందమైన ద్వీపం అనే సంగతి అందరికి తెలిసిందే. అది ప్రపంచ ప్రసిద్ధిచెందిన గమ్యస్థానం కావడంతో నిత్యం టూరిస్టులతో రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఇకపై టూరిస్టులు బైక్ రైడింగ్ చేసే అవకాశం లేకుండాపోనుంది. అందుకు సంబంధించిన చర్యలను అధికారులు త్వరలోనే అమలుచేయనున్నారు. బాలిలో సందర్శనీయ ప్రాంతాలను చూడటానికి టూరిస్టులు ఎక్కువగా మోటార్ బైక్‌లను అద్దెకు తీసుకొని విహరిస్తుంటారు. కొన్ని కారణాల నేపథ్యంలో అధికారులు త్వరలోనే టూరిస్టులకు బైక్ రైడింగ్ బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.