•   Saturday, 15 Mar, 2025

యూరప్‌లోని ఆ రెండు దేశాలు ఉద్యోగులకు డిజిటల్ నోమాడ్ వీసాలను అందిస్తున్నాయి..

Generic placeholder image
  Johan

కొవిడ్-19 చాలా మందికి తమవారిని దూరం చేసి ఎనలేని బాధను మిగల్చడమే కాకుండా కొంత మందికి వర్క్ పరంగా కొంచెం రిలీఫ్‌ని ఇచ్చిందనే చెప్పాలి. కరోనా కారణంగా ఐటీ కంపెనీలన్నీ దాదాపు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ కల్పించింది. దీంతో చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఆన్‌లైన్‌ వ్యవహారాలు చూసుకునేవారంతా ఇంటి నుంచే పని చేయడం మొదలెట్టారు. అయితే, ఇక్కడ కొంత మంది ఈ వర్క్ ఫ్రం హోమ్‌ అవకాశాన్ని కూడా తమకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోవడం ప్రారంభించారు.

కరోనా టైమ్‌లో ఇంట్లో నుంచే పనిచేసినా తర్వాత తమకు నచ్చిన చోటుకు వెళ్లి హాయిగా వర్క్ చేస్తూనే వెకేషన్ ట్రిప్‌లను ప్లాన్ చేసుకుంటున్నారు. అలా ప్రత్యేకంగా సెలవులు పెట్టకుండానే తమకు నచ్చిన ప్రదేశాన్ని చూసొస్తున్నారు. అలాంటి వారికే ఇప్పుడు యూరప్‌లోని రెండు దేశాలు డిజిటల్ నోమాడ్ వీసాలను జారీ చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇకపై ఆయా దేశాలకు వెళ్లి మరీ తమ పనులు కొనసాగించుకోవచ్చు. ఆ విశేషాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Comment As:

Comment (0)