•   Saturday, 15 Mar, 2025

ప్రకాశం: ట్రావెల్స్ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం, 25మంది సురక్షితం

Generic placeholder image
  Johan

Prakasam Bus Fire ప్రకాశం జిల్లాలో హైవేపై వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట దగ్గర ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట దగ్గర ప్రైవేటు మంటల్లో బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే గమనించిన డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.. బస్సులో నుంచి అందరూ దిగిపోయారు. అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల సామగ్రి మంటల్లో కాలిపోయింది. ప్రయాణికులెవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

డ్రైవర్ అప్రమత్తతతో ఘోర ప్రమాదం తప్పిపోయింది. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణీకులు ఉన్నారు.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. హైటెన్షన్ వైర్లు బస్సుకు తగలడంతో మంటలలో చిక్కుకున్నట్లు చెబుతున్నారు. జరుగుమల్లి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు మంటల్ని ఆర్పేశారు. ప్రయాణికుల్ని ఇతర ట్రావెల్స్ బస్సులను రప్పించి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు పంపించారు. ప్రయాణికుల్లో హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comment As:

Comment (0)