•   Saturday, 15 Mar, 2025

Kidney Health: షుగర్‌ పేషెంట్స్‌ ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయ్..!

Generic placeholder image
  Johan

 షుగర్‌ పేషెంట్స్‌ ఎక్కువగా కిడ్నీ సమస్యలతో భాదపడుతుంటారు. కిడ్నీ సమస్యలు రాకుండా షుగర్‌ పేషెంట్స్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.​

మారుతున్న జీవనశైలితో డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. డయాబెటిస్‌ను సైలెంట్‌ కిల్లర్‌ అనొచ్చు. షుగర్‌ పేషెంట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంచుకోకపోతే తీవ్ర అనారోగ్యాలు ఎదుర్యే ప్రమాదం ఉంది. షుగర్‌కు మెడిసిన్స్‌ వాడుతున్నా ఏళ్లు గడిచేకొద్దీ శరీరంలోని ఒక్కో అవయవాన్ని నాశనం చేస్తుంది. కిడ్నీలపై డయాబెటిస్‌ తీవ్రత అధికంగా ఉంటుందని డాక్టర్‌ ప్రకాష్‌ చంద్రశెట్టి అన్నారు. డయాబెటిస్‌ ప్రాణాంతక ప్రభావాల నుంచి మూత్రపిండాలను ఎలా రక్షించుకోవాలో డాక్టర్‌ ప్రకాశ్ చంద్రశెట్టి వివరించారు.​

కిడ్నీల్లో ఉండే చిన్న చిన్న నిర్మాణాలను నెఫ్రాన్లు అంటారు. షుగర్‌ వచ్చినపుడు అవి సరిగా పని చేయవు. దాంతో గ్లూకోజ్‌ శరీరంలో నిల్వ ఉండిపోతుంది. కిడ్నీలు అధికంగా రక్తాన్ని వడపోయాల్సి రావడంతో వాటి పనితీరు క్రమంగా మందగిస్తుంది. షుగర్‌ పేషెంట్స్‌లో చాలా మందికి హైపర్‌టెన్షన్‌ కూడా ఉండటం సమస్యాత్మకంగా మారుతుంది. ఈ సమయంలో కాళ్లు, మొహం వాపు, వాంతులు, వికారం, చర్మంపై దురద వస్తుంది. కిడ్నీల్లో రాళ్లు రావొచ్చు.​

Comment As:

Comment (0)