•   Saturday, 15 Mar, 2025

Baby Corn Health Benefits: బేబీ కార్న్‌ మీ డైట్‌లో చేర్చుకుంటే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉండటంతో పాటు, గుండెకు మంచిది..!

Generic placeholder image
  Johan

బేబీ కార్న్‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. బేబీ కార్న్‌ మంచూరియా, బేబీ కార్న్ ఫింగర్స్‌, బేబీ కార్న్‌ సూప్‌, సలాడ్‌ ఇలా ఏది చేసినా ఎంజాయ్‌ చేస్తూ తింటారు. బేబీ కార్న్‌ను మంచి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ కార్న్‌తో పోలిస్తే చిన్నవిగా, మొగ్గ దశలో ఉండే బేబీ కార్న్‌లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు , కొవ్వు తక్కువగా ఉంటాయి. మన డైట్‌లో తరచుగా బేబీ కార్న్‌ చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.​

బేబీ కార్న్‌లో మన ఆరోగ్యానికి మేలు చేసే.. విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్ వంటి బి గ్రూప్‌ విటమిన్లు మెండుగా ఉంటాయి. B గ్రూప్‌ విటమిన్లు మన శరీర శక్తికి మద్దతు ఇవ్వడానికి కీలక పాత్ర పోషిస్తాయి, నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడతాయి. బేబీ కార్న్‌లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్‌ కూడా మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రక్త కణాలను నిర్వహించడానికి, కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

 

Comment As:

Comment (0)