Tips To Relive Back Pain: నడుము నొప్పా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పని సరి


ప్రస్తుతం ఎంతో మంది నడుము నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పని ఒత్తిడి, కాల్షియం కొరత, బలహీనత, ఆరోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల ఈ రోజుల్లో చాలా మంది నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. కండరాలు బాగా అలసిపోవడం, ప్రయాణాలు చేయడం, బైక్ నడపడం, ముందుకు వంగే పనులు చేయడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. నడుము నొప్పి వల్ల చిన్న పని చేయాలన్నా, వంగాలన్నా, కొంతసమయం కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. నడుము నొప్పి వల్ల మీ డైలీ రొటీన్ దెబ్బ తింటూ ఉంటుంది, పనులు పెండింగ్ పడుతూ ఉంటాయి. మీ నడుము నొప్పితో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. మీరు నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన చిట్కాలు సహాయపడతాయి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
వెన్నునొప్పి వల్ల లేవడం, కదలడమే కష్టంగా ఉంటుంది. కానీ యోగా, వాటర్ ఏరోబిక్స్, ఏరోబిక్స్, స్విమ్మింగ్, వాకింగ్ వంటి తక్కువ తీవ్రత గల వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌అర్‌సైజ్ చేయడం వల్ల మెదడు న్యాచురల్ పేయిన్ కిల్లర్ అయిన ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది బిగుతుగా మారిన కండరాలను రిలాక్స్ చేస్తుంది, తద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.