Diabetes Diet: వర్షాకాలం ఈ పండ్లు తింటే.. షుగర్ కంట్రోల్ ఉంటుంది..!


షుగర్ పేషెంట్స్ ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్స్ వర్షాకాలం కొన్ని పండ్లు తింటే.. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 422 మిలియన్ల మంది డయాబెటిస్ బారిన పడ్డారు. ఈ రోజుల్లో ఇంట్లో కనీసం ఒక్కరైనా డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఒక సారి డయాబెటిస్ వస్తే.. జీవితాంతం మందులు వేసుకుంటూనే ఉండాలి. దీనికి శాశ్వతంగా తగ్గించలేం. షుగర్ పేషెంట్స్ దీర్ఘకాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోకపోతే.. కిడ్నీ, నరాల, కంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంచడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. వర్షాకాలం షుగర్ పేషెంట్స్ కొన్ని పండ్లు తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలో కంట్రోల్‌లో ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి.