ఆంధ్రా చికెన్ ఫ్రై.. టేస్ట్ అదిరిపోతుంది..


Johan
Step 1:
ముందుగా ఉల్లిపాయలు, టమాటా, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాలు, కారం మరియు ఇతర పదార్థాలని పేస్టు మాదిరిగా చేసుకోవాలి.
Step 2:
పాన్ లో ఆయిల్ వేసి అందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇపుడు తయారు చేసుకున్న మసాలాని కూడా ఇందులో వేసి మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి.
Step 3:
ఇప్పుడు చికెన్ ని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల మసాలా బాగా పడుతుంది.
Step 4:
పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద దీనిని ఉంచండి. కొద్దిగా నీళ్లు కూడా వెయ్యండి. ఆ తర్వాత ఎనిమిది నుండి పది నిమిషాల పాటు ఉడికించండి.
Step 5:
ఇప్పుడు ఈ రెసిపీని సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి.