•   Saturday, 15 Mar, 2025

నోరూరించే ఉలవల రసం.. ఎలా చేయాలంటే..

Generic placeholder image
  Johan

 

Step 1:

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉలవచారును కేవలం నాలుగంటే నాలుగు సింపుల్​ స్టెప్స్​ లో తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Step 2:

ప్రెషర్​ కుక్కర్ లో ఉలవలు మరియు నీరు పోసి నాలుగైదు విజిల్స్​ వచ్చేంత వరకు వాటిని ఉడికించాలి. ఉలవచారు రెసిపీని తయారు చేసుకోవడానికి ఉలవలను మొదటగా ఉడకబెట్టడం చాలా ఇంపార్టెంట్​.

Step 3:

ఒక గ్రైండర్​ లో ఎండు కొబ్బరిని వేసి అందులో ఉల్లిగడ్డ మరియు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవలను అందులో వేసి గ్రైండ్​ చేయాలి. ఈ మూడు పదార్థాల మిశ్రమం బాగా మిక్స్​ అయ్యేంత వరకూ గ్రైండ్​ చేసుకోవాలి.

Step 4:

స్టవ్​ మీద ఒక ప్యాన్​ ను పెట్టి వేడి చేయాలి. అనంతరం ఆ ప్యాన్​ లో ఆయిల్​ ను పోసి వేడి చేసుకోవాలి. ప్యాన్​ లో పోసిన ఆయిల్​ వేడి అయిన తర్వాత ఆవాలు మరియు ఇంగువ వేయాలి. అనంతరం అందులో రెండు గ్లాసుల నీటిని ప్యాన్ లో పోసి మనం ముందుగా గ్రైండ్​ చేసిన ఉల్లిగడ్డ మరియు ఉడకబెట్టిన ఉలవలను వేసి కలుపుకోవాలి. ఇలా ప్యాన్​ లో వేసిన అన్ని పదార్థాలు బాగా మిక్స్​ అయ్యేలా కలుపుకోవాలి.

Step 5:

మనం ప్యాన్​ లో పోసిన నీరు రసంలా మారి వేడి అయిన తర్వాత ఆ రసానికి రసం పౌడర్​ ను కలుపుకోవాలి. రసం పౌడర్​ తో పాటు చింతపండును కూడా గుజ్జును కూడా ఆ రసానికి కలపాలి. బెల్లం కావాలనుకున్న వారు బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు. ఇక చివరగా రసంలో ఉప్పు వేసి మరింగా మరగబెట్టాలి. రసం చిక్కగా అయిన తర్వాత మనం ప్యాన్​ ను స్టవ్​ మీది నుంచి దించే ముందు ఆ రెసిపీలో కొత్తిమీర ఆకులను వేసుకుంటే రసం టేస్టే మారిపోతుంది. దించిన తర్వాత రసాన్ని అన్నంతో పాటు కలుపుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ రసాన్ని ఫ్రిడ్జ్​ లో స్టోర్​ చేసుకుని తెల్లవారిన తర్వాత తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇలా రసాన్ని చాలా సింపుల్​ స్టెప్స్​ లో తయారు చేసుకోవచ్చు.

Comment As:

Comment (0)