Fact Check వాట్సాప్‌లో 3 టిక్స్ పడితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..! ఇందులో నిజమెంత?


Fact Check వాట్సాప్‌లో 3 టిక్స్, రెడ్ టిక్స్ గురించి సోషల్ మీడియాలో మరోసారి ఫేక్ మెసెజ్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం.. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది ఇప్పుడే చూసెయ్యండి...
Fact Check ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే యాప్స్‌లో వాట్సాప్ మెసెంజర్ యాప్ ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ను వాడుతున్నారు. ఎందుకంటే మెసెజ్ పర్ఫెక్టుగా డెలివరీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఈ యాప్‌లో పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. వాట్సాప్ సింగిల్ టిక్ లేదా డబుల్ టిక్ మార్క్స్ అందరికీ తెలుసు. కానీ మూడు బ్లూ టిక్స్ వస్తే.. మన మెసెజెస్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని.. రెండు బ్లూ టిక్స్, ఒక రెడ్ టిక్ వస్తే మెసెజ్ పంపిన వారిపై యాక్షన్ తీసుకుంటుందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చక్కర్లో కొడుతోంది. అంతేకాదు ఒక బ్లూ టిక్, రెండు రెడ్ టిక్స్ వస్తే.. మెసెజ్ పంపిన వారి డేటాను ప్రభుత్వం స్కాన్ చేస్తుందట. ఒకవేళ మూడు రెడ్ టిక్స్ వస్తే సర్కార్ మెసెజ్ సెండ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందట. వారికి త్వరలో కోర్టు సమన్లు కూడా అందుతాయనే ప్రచారం జరుగుతోంది.