•   Saturday, 15 Mar, 2025

Relationship: నా భార్య ఆఫీస్‌లో ఉండటానికే ఇష్టపడుతుంది.. నాతో టైమ్‌ గడపట్లేదు

Generic placeholder image
  Johan

నా భార్య ఎక్కువ సమయం ఆఫీస్‌లోనే ఉంటుంది. ఇంట్లో‌ టైమ్‌ స్పెండ్‌ చేయడానికి ఆమె ఇష్టపడం లేదు.

నాకు పెళ్లై మూడు సంవత్సరాలు అయ్యింది. ప్రస్తుతం నాకు, నా భార్యకు పిల్లలు కనాలనే ఆలోచన లేదు. మేము ఇద్దరం ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాం. మా ఇంటి పనులు చేయడానికి పనివాళ్లు కూడా ఉన్నారు. విషయం ఏమిటంటే, నా భార్యకు ఇంట్లో సమయం గడపడం ఇష్టం ఉండదు. ఆమె ప్రతి రోజు ఆఫీస్‌లో ఎక్కువ సమయం గడుపుతుంది లేదా తన పని పూర్తైన తర్వాత సినిమాకు వెళ్తుంది. నేను రాత్రి భోజనం ముగించే సమయానికి ఆమె పది గంటలకు ఇంటికి చేరుకుంటుంది. దాదాపు 15-20 నిమిషాలు మాట్లాడుకుని నిద్రపోతాం. వారాంతాల్లో కూడా, ఆమె ఇంట్లో ఉండడం కంటే తన స్నేహితులతో కలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. మేము కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం లేదు. ఆమెకు ఇంటి పనుల పట్ల ఆసక్తి లేదు. మేము ఒకసారి ఈ అంశంపై గొడవ కూడా పడ్డాం. పెళ్లైన మూడేళ్ల తర్వాత.. ప్రతి ఒక్కరి వివాహ బంధం ఇలానే ఉంటుందని తనను తాను సమర్థించుకుంది. రొమాంటిక్‌ టైమ్‌ అయిపోయిందని, ఎవరి సొంత లైఫ్‌ వారికి ఉండాలని తను అంటోంది.

రచన అవతరమణి ఈ సమస్యకు సమాధానం ఇచ్చారు. వివాహ అనేది జీవితాం వరకు ఉండే చక్కని అనుబంధం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పెట్టుబడి. ఇది భౌతిక పెట్టుబడి మాత్రమే కాదు, భావోద్వేగాలు, సమయాన్ని కూడా దీనికి పెట్టుబడి పెట్టాలి. ఈ లాంగ్‌టెర్మ్‌ రిలేషన్‌, వివిధ దశల గుండా వెళుతుంది. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఆలుమగలు ఇద్దరు కలిసి అధిగమించాలి.

మీకు పెళ్లయి మూడేళ్ళైంది. మీరు, మీ భార్య పిల్లల్ని కనే ఆలోచనలో లేరని, మీరిద్దరూ బాగా సంపాదిస్తున్నారని, హాయిగా జీవితాన్ని గడుపుతున్నారని నాకు అర్థమైంది. అయితే, మీ భార్య పని నుంచి ఆలస్యంగా ఇంటికి రావడం, ఇంట్లో సమయం గడపకపోవడం ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారు. అలాగే ఆమె మీతో చాలా అరుదుగా మాట్లాడుతుంది. వారాంతాల్లో కూడా ఆమె తన స్నేహితులను కలవడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఆమెతో వాగ్వాదానికి దిగడం వల్ల ఇది మీకు చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుందని నేను అర్థం చేసుకున్నాను.

ప్రతి బంధం ఒకే దశలో సాగదు. రొమాంటిక్‌ ఫేజ్‌ ముగిసిందని, మీ వివాహ బంధం స్తబ్దుగా ఉన్నట్లు ఆమె భావించవచ్చు. ఆమెకు ఈ బంధంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో తెలుసుకోవాడానికి ప్రయత్నించండి. ఈ సంబంధం నుంచి ఆమె ఏమి ఆశిస్తున్నారో అడిగి తెలుసుకోండి. ఆమెను బాధపెట్టిన విషయం ఏదైనా ఉందా? ఆమెకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం ఉత్తమం.

Comment As:

Comment (0)