World Breastfeeding Week : పాలిచ్చే తల్లులు ఈ కూరగాయలు అస్సలు తినొద్దు..


తల్లి అయ్యాక పిల్లలకి పాలు ఇవ్వడం చాలా ముఖ్యం. దీని వల్ల బిడ్డ, తల్లికి కూడా చాలా ఆరోగ్యం. ఇలాంటి టైమ్‌లో తల్లులు కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది. అవేంటో తెలుసుకోండి.
ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయిన దగ్గర్నుంచి డెలివరీ అయ్యే వరకూ ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా, డెలివరీ తర్వాత కూడా సరైన డైట్ పాటించాలి. ఎందుకంటే ఆ టైమ్‌లో పుట్టిన పిల్లలకి పాలు ఇస్తారు. ఇలాంటి టైమ్‌లో అన్ని ఫుడ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే డెలివరీ అయిన మహిళలు ఏది తిన్నా పాల రూపంలో బిడ్డకి చేరతాయి. కాబట్టి, తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ అస్సలు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటంటే..
నిపుణుల ప్రకారం..
తల్లి తీసుకునే ఆహారంపైనే పిల్లల ఆరోగ్యం నిర్ణయించబడి ఉంటుంది. తల్లి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని తింటే బిడ్డకి జీర్ణమవ్వడం కష్టంగా ఉంటుంది. పుట్టిన బిడ్డకి కనీసం 6 నెలల పాటు తల్లిపాలు పట్టాలి. అందుకే తినే ఆహారం విషయంలో శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు.