AI Replace Human Jobs ఈ రంగంలో ఉండే వారిని ఎఐ టెక్నాలజీ కనీసం టచ్ కూడా చేయలేదట...!


AI Replace Human Jobs ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీతో పని చేసే OpenAI, చాట్‌బాట్, chatGPTకి ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించి జోరుగా చర్చ జరుగుతోంది. టీ కొట్టు నుంచి ఆఫీస్ వరకు ఎఐ, దాని సామర్థ్యాలపై చాలా మందిలో ఆందోళన నెలకొంది. ఎందుకంటే త్వరలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు చాట్‌జిపిటి ద్వారా పలు ఉద్యోగాలు సైతం కనుమరుగయ్యాయి. 2030 నాటికి లక్షలాది సంఖ్యలో ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయని మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ తాజా అధ్యయనంలో స్పష్టం చేసింది. అందరికంటే ముందుగా అమెరికాపై ఎఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక కారణంగా న్యాయవాదులు, ఆర్థిక వేత్తల నుంచి రచయితల వరకు, పరిపాలనా ఉద్యోగులు కూడా ప్రమాదంలో పడ్డారు. ఎందుకంటే AI చేయలేని లేదా నేర్చుకోలేని పని ఏదీ లేదు. అయితే ఈ టెక్నాలజీ ఓ పని చేయడంలో మాత్రం విఫలమైంది. ఈ రంగంలో పని చేసే వారిని AI ఎప్పటికీ ప్రభావం చూపదని ఇటీవలే ఓ అధ్యయనం వెల్లడైంది.