నీలి రంగు నుంచి ఆకుపచ్చగా మారిపోతున్న సముద్రాలు.. దేనికి సంకేతం?


Johan
2100 సంవత్సరం నాటికి పెరిగే అధిక ఉష్ణోగ్రతను నియంత్రించి, కరిగిపోతున్న అంటార్కిటికా మంచు ఖండాల్ని అటవీ సంపదల్ని కాపాడాలని, లేకపోతే రేపటి తరానికి భూమ్మీద భవిష్యత్తు ఉండదని పర్యావరణ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ వాతావరణ మార్పులను సీరియస్‌గాా తీసుకున్నట్టు కనిపించడం లేదు. గ్రీన్ హౌస్ వాయువులు, కర్బన ఉద్గరాలను సగానికి సగం తగ్గిస్తామని నేతలు చేసిన ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు.